ETV Bharat / state

దంపతుల ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమా..?! - గుంటూరులో గడ్డి మందు తిని దంపతుల ఆత్మహత్యాయత్నం

couple suicide attempt: తెలంగాణకు చెందిన ప్రేమికులు.. రెండు నెలల క్రితం ఒక్కటయ్యారు. పెద్దలకు ఇష్టం లేని పెళ్లి కావటంతో.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కాపురం పెట్టారు. అయితే.. అమ్మాయి తరుపువారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. దంపతులిద్దరినీ స్టేషన్​కు తరలించారు పోలీసులు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ విషం తిని ఆత్మహత్యకు యత్నించారు.

telangana couple suicide attempt in guntur
గడ్డి మందు తిని దంపతుల ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Mar 19, 2022, 7:41 AM IST

couple suicide attempt: తెలంగాణలోని నల్గొండ జిల్లా అడవి దేవరపల్లికి చెందిన ఆటో మెకానిక్ హాజీబాబా.. అదే గ్రామానికి చెందిన మాధవి ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరిద్దరూ రెండు నెలల క్రితం.. వివాహం చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకు భయపడి.. గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం శాంతినగర్ కు వచ్చి కాపురం పెట్టారు. అయితే.. మాధవి కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి ఇష్టంలేదని సమాచారం.

ఈ నేపథ్యంలో మాధవి తల్లి.. తన కుమార్తె కనిపించడం లేదంటూ అడవిదేవరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న పోలీసులు శాంతినగర్ కు వచ్చి.. దంపతులిద్దరిని అడవిదేవరపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. హాజీబాబా కుటుంబసభ్యులు.. స్టేషన్​కు వెళ్లి, పోలీసులతో మాట్లాడంతో దంపతులిద్దరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

అక్కడి నుంచి తిరిగి శాంతినగర్ కు వచ్చిన దంపతులు.. పోలీసులు తమపై వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తీవ్ర ఆవేదనతో.. ఈ నెల 17 రాత్రి విషం తిని ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు దంపతులిద్దరిని పిడుగురాళ్లలోని వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం.. నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతున్న బాధితులు.. నరసరావుపేట రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల తమను ఇంటి దగ్గర కొట్టడంతోపాటు స్టేషన్‌కు తీసుకెళ్లి వేధించారని దంపతులు ఆరోపించారు.

ఇదీ చదవండి:

VOA Nagalakshmi suicide : ఆమె ఆత్మహత్య చేసుకుంటే గానీ.. నిందితుడి అరెస్టు లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.