ETV Bharat / state

TEACHERS AGITATION: ఉపాధ్యాయుడిపై దాడి..టీచర్ల సంఘాల ఆందోళన - teachers protest on attack on teachers

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు జడ్పీ ఉన్నత పాఠశాల ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయునిపై భౌతికదాడి చేయడం దారుణమని ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్ జోసఫ్ సుధీర్​ అన్నారు. ఉపాధ్యాయులపై దాడి చేసిన వారందరిపై కేసు నమోదు.. అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు.

teachers protest
teachers protest
author img

By

Published : Sep 8, 2021, 5:03 PM IST

ఉపాధ్యాయ సంఘాల నిరసన

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో..విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఉపాధ్యాయుడిపై బంధువుల దాడిని (attack on teacher).. ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. పాఠశాల వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఉపాధ్యాయుడు తప్పు చేస్తే.. ప్రధానోపాధ్యాయుడు, పోలీసులకు ఫిర్యాదు చేయాలిగానీ.. ఉపాధ్యాయునిపై భౌతికదాడి చేయడం (attack on teacher) దారుణమని ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్ జోసఫ్ సుధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

బాధిత ఉపాధ్యాయుడు రవిబాబు మంచి వ్యక్తి అని.. అతని సర్వీసులో సేవా కార్యక్రమాలు చాలా చేశారని సుధీర్​ అన్నారు. ఉపాధ్యాయులపై దాడి చేసిన వారందరిపై కేసు నమోదు చేసి.. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మేకతోటి సుచరితను కలిసి ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని కోరతామన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని ఆదేశాల మేరకు.. డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు ఘటనపై విచారణ చేపేట్టేందుకు పాఠశాలకు వెళ్లారు. పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు.

'రవిబాబు మంచి వ్యక్తి . అతని సర్వీసులో సేవా కార్యక్రమాలు చాలా చేశారు. ఉపాధ్యాయుడు తప్పు చేస్తే.. ప్రధానోపాధ్యాయుడుకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలిగానీ.. ఉపాధ్యాయునిపై భౌతికదాడి చేయడం దారుణం. ఉపాధ్యాయులపై దాడి చేసిన వారందరిపై కేసు నమోదు చేసి.. వెంటనే అరెస్ట్ చేయాలి' -ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్ జోసఫ్ సుధీర్

అసలేం జరిగింది..

వట్టిచెరుకూరులో ఉపాధ్యాయుడు రవిబాబు​పై ఓ విద్యార్థిని బంధువులు మంగళవారం దాడి చేశారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై సదరు ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక తన చేతిని హిందీ ఉపాధ్యాయుడు రవిబాబు సోమవారం రెండుసార్లు పట్టుకొని గట్టిగా నొక్కారంటూ ఇంటి వద్ద తల్లిదండ్రులకు చెప్పుకొని వాపోయింది. దీనిపై ఆగ్రహించిన ఆమె బంధువులు మంగళవారం ఉదయం పాఠశాల వద్దకు వెళ్లి తరగతి గదిలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు రవిబాబును బయటికి పిలిచి తరుముకుంటూ కొట్టడం మొదలుపెట్టారు (attack on teacher). అది చూసిన ప్రధానోపాధ్యాయుడు గుత్తా శ్రీనివాసరావు వారిని అడ్డుకొని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఆగ్రహంతో ఉన్న బాలిక బంధువులు ఆయనపై దాడి చేయగా తోటి ఉపాధ్యాయులు అడ్డుకోవడానికి రాగా వారినీ కొట్టారు. అనంతరం బాలిక ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హిందీ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

దాడిపై ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు..

ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, తనపై దాడి చేసిన వారిపై పోలీస్‌స్టేషన్‌లో ప్రధానోపాధ్యాయుడు గుత్తా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

attack: ఉపాధ్యాయుడిపై విద్యార్థి బంధువులు దాడి

CM JAGAN REVIEW: ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి: జగన్​

Results: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.