ఉపాధ్యాయలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాండురంగారావు అన్నారు. గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాండురంగారావు.. గుంటూరులో పలువురు ఉపాధ్యాయులను కలిసి ఓటును అభ్యర్థించారు. సీపీఎస్ రద్దుకు కృషి చేస్తానని, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల కోసం ఏపీటీఎఫ్ తరఫున పోరాటం కొనసాగిస్తామన్నారు. కేజీబీవీ, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తానని పాండురంగారావు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి