ETV Bharat / state

TDP Leaders Protest against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగిన టీడీపీ నిరసనలు - TDP Leaders Protest

TDP Leaders Protest against Chandrababu Arrest: సైకో పాలనతో ప్రజలు విసుగు చెందారని.. ప్రజా ఉద్యమం తప్పదని టీడీపీ నేతలు హెచ్చరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణుల నిరసనలు పట్టువిడవకుండా కొనసాగుతున్నాయి. మహిళలు పెద్దసంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీల్లో పాల్గొని కదం తొక్కారు. చంద్రబాబును విడుదల చేసేవరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. చంద్రబాబు చంద్రబాబుకు మద్దతుగా కెనడాలో సైతం నిరసనలు కొనసాగుతున్నాయి.

TDP Leaders Protest against Chandrababu Arrest

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2023, 7:22 AM IST

TDP Leaders Protest against Chandrababu Arrest: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును (Chandrababu Naidu Arrest) నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు జంబులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. 101 కొబ్బరికాయలు కొట్టి తమ అధినేతకు మంచి జరగాలని కోరుకున్నారు. నంద్యాలలో గాంధీ విగ్రహానికి టీడీపీ శ్రేణులు వినతిపత్రం సమర్పించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కొట్టాలు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా విదేశాల్లో సైతం నిరసనలు కొనసాగుతున్నాయి. కెనడాలోని సెంట్రల్ టొరంటోలో నిరసనలలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

TDP Leaders Protest against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగిన టీడీపీ నిరసనలు

Statewide Protests Against Chandrababu Arrest బాబు అరెస్టుపై కొనసాగుతున్న నిరసనల వెల్లువ.. ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు..

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విజయవాడలో మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో ముస్లిం యువకులు ఆందోళన చేపట్టారు. ప్రజలు సైకో పాలనతో విసుకు చెందారని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం తప్పదని ఆయన అన్నారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగటానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రకటించారు. టీడీపీ నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మచిలీపట్నంలో రిలే నిరహార దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ నాయకుడు తలకిందులుగా కాళ్లు పైకి పెట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కృష్ణాజిల్లా కూచిపూడిలోని దీక్షా శిబిరాన్ని మాజీమంత్రి కొల్లు రవీంద్ర సందర్శించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని.. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పమిడిముక్కల నుంచి వీరంకి వరకు మహిళలు అఖండ దీపాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో టీడీపీ, జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.

TDP Leaders and Activists Protests: పట్టు వదలని టీడీపీ నేతలు.. శిబిరాల్లోనే వినాయకుడి పూజలు

నరసరావుపేటలో దీక్షా శిబిరాన్ని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ పల్నాడు జిల్లా క్రోసూరులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా పామూరులో మహిళలు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాకినాడలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు, వాకలపూడిలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు కార్యకర్తలతో కలిసి దీక్షల్లో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దీక్షా శిబిరాన్ని కార్మికులు, మత్స్యకారులు సందర్శించి సంఘీభావం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వేలివెన్నులో వందలాది మంది మహిళలు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొవ్వూరు మండలం పసివేదలలో కాగడాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.

TDP Leaders Performed Pujas for Chandrababu: ఏపీలో కొనసాగుతున్న ఆందోళనలు, పూజలు.. నిరసనలు

విశాఖలో మహిళలు నలుపు రంగు వస్త్రాలు ధరించి బీచ్‌ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలంతా నలుపు వస్త్రాలు ధరించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భీమిలిలో టీడీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడలో టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో టీడీపీ నేతలు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు.

Protests Against Chandrababu Arrest: ఆగని ఆగ్రహ జ్వాలలు.. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.