ETV Bharat / state

వారికి నోటీసులు ఇవ్వటంపై తెదేపా నేతల ఆగ్రహం

author img

By

Published : Mar 7, 2022, 4:27 PM IST

గుంటూరులోని మద్దిరాల కాలనీలో రైల్వే ట్రాక్ సమీపంలో ఇళ్లు కట్టుకున్నవారికి నోటీసులు ఇవ్వటంపై తెదేపా ఆందోళన నిర్వహించింది. ఏళ్ల తరబడి నివసిస్తున్న వారికి ఇళ్లు తొలగిస్తామంటూ.. నోటీసులు ఇవ్వటంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా ఆస్తి పన్ను, నీటి పన్ను వసూలు చేస్తున్నఅధికారులు.. ఇప్పుడు ఖాళీ చేయాలంటే ఎలాగని ప్రశ్నించారు.

Tdp leaders
Tdp leaders

గుంటూరులోని మద్దిరాల కాలనీలో రైల్వే ట్రాక్ సమీపంలో ఇళ్లు కట్టుకున్న వారికి నోటీసులు ఇవ్వటంపై తెలుగుదేశం పార్టీ ఆందోళన నిర్వహించింది. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయం వద్ద తెదేపా నేతలు, మద్దిరాల కాలనీ వాసులు ధర్నా చేశారు. ఏళ్ల తరబడి అక్కడే ఉంటున్న వారి ఇళ్లు తొలగిస్తామని నోటీసులు ఇవ్వటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ రైల్వే స్థలాలకు పక్కన ఉన్నవారికి కూడా నోటీసులు ఇవ్వటాన్ని తప్పుబట్టారు. రైల్వే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రీ సర్వే చేయాలని కోరారు.

తప్పనిసరిగా ఖాళీ చేయాల్సిందే..

ఈ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. తప్పనిసరిగా అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు. గడువు పెంపుపై ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాలని సూచించారు. అక్కడ నివసిస్తున్న వారి నుంచి ఆస్తిపన్ను, నీటిపన్ను వసూలు చేస్తున్న అధికారులు ఇప్పుడు ఖాళీ చేయాలంటే ఎలాగని తెదేపా నేతలు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ముస్తఫా ఇక్కడ వారందరికీ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని.. దాన్ని నిలబెట్టుకోలేదని విమర్శించారు.

ఇదీ చదవండి : టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న బ్యాంకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.