TDP YANAMALA ON SCHOOLING IN AP : దేశంలోనే ప్రథమ స్థాయిలో ఉండాల్సిన విద్యా వ్యవస్థ.. జగన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల అథమ స్థాయికి చేరిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. బాలికల పాఠశాల విద్యలో ఏపీ దేశంలోనే 10వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలు పడిపోయాయని అసర్ నివేదిక బయట పెట్టిందన్నారు. నాణ్యమైన విద్యలో రాష్ట్రాన్ని 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ అసమర్థత వల్ల విద్యార్ధుల డ్రాప్ ఔట్స్ పెరిగిపోయాయని మండిపడ్డారు. జగన్ పర్యటనల కోసం స్కూల్ బస్సులను బలవంతంగా లాక్కొంటూ విద్యా సంస్థలను దౌర్జన్యంగా మూయించేస్తున్నారని దుయ్యబట్టారు. ఉపాధ్యాయులతో మద్యాన్ని అమ్మించిన హీన చరిత్ర జగన్ దని విమర్శించారు. ప్రతి ఏటా డీఎస్సీ అమలు చేస్తానని హామీ ఇచ్చి.. ఒక్క డీఎస్సీ కూడా అమలు చేయలేదని ఆక్షేపించారు. విలీనం పేరుతో 3.50 లక్షల మంది విద్యార్ధులను.. ప్రభుత్వ పాఠశాలలకు దూరం చేశారని ధ్వజమెత్తారు. అమ్మ ఒడిని.. నాన్న బుడ్డిగా మార్చడం సహా విదేశీ విద్యను నిర్వీర్యం చేసి.. నాడు-నేడును దోపిడీ పథకంగా మార్చుకున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: