19 నెలల్లో వినుకొండ పట్టణానికి చేసిన అభివృద్ధి ఏమీ లేక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖం చాటేస్తున్నారని మాజీఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 20, 21వ వార్డులో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాలనలో అభివృద్ధి శూన్యమని, లంచం లేనిదే ఏ పని జరగడం లేదని, ఇసుక మాఫియా పేట్రేగిపోతోందని ఆరోపించారు. అభివృద్ధి చేయలేదు కాబట్టే ప్రచారానికి రావడం లేదని విమర్శించారు.
తెదేపా హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సిప్ నిధులు, శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.159 కోట్లు మంజూరయ్యాయని జీవీ ఆంజనేయులు అన్నారు. వైకాపా పాలనలో మద్యం, ఇసుక దోపిడీ పెరిగిపోయిందని, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.
ఇదీచదవండి.