ETV Bharat / state

వైకాపా తీర్థం పుచ్చుకున్న తెదేపా నేత గంజి చిరంజీవి - తెదేపా నేత గంజి చిరంజీవి

TDP GANJI JOINED IN YSRCP తెలుగుదేశం పార్టీ నేత గంజి చిరంజీవి వైకాపాలో చేరారు. సీఎం జగన్​ సమక్షంలో వైకాపా కండువా కప్పుకున్నారు. మంగళగిరిలో గత ఎన్నికల కన్నా ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని చిరంజీవి స్పష్టం చేశారు.

TDP GANJI JOINED IN YSRCP
TDP GANJI JOINED IN YSRCP
author img

By

Published : Aug 29, 2022, 7:26 PM IST

TDP leader Ganji Chiranjeevi joined in YSRCP: తెదేపా నేత గంజి చిరంజీవి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను కలిసిన ఆయన.. పార్టీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో వైకాపా తరఫున గంజి చిరంజీవిని బరిలో నిలపాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2014లో వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై తాను పోటీ చేసి 12 ఓట్ల తేడాతో ఓడానని.. 2019లో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై లోకేశ్​ 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారన్నారు.

గత ఎన్నికల కన్నా ఎక్కువ లేదా అంతకన్నా ఎక్కువ మెజారిటీతో మంగళగిరిలో గెలుస్తామన్నారు. సీఎం జగన్ ఎవరి పేరు చెప్పినా కలసి పనిచేసి వైకాపాను గెలిపిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి చేనేతలను సంఘటితపరుస్తానని గంజి చిరంజీవి అన్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వందకు వందశాతం తానే మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు సమాచారం.

సీఎం జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరిన గంజి చిరంజీవి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.