ETV Bharat / state

అమరావతిపై సుప్రీం తీర్పును వక్రీకరించిన ఘనులు వైసీపీ నాయకులు: ధూళిపాళ్ల

Dhulipalla fires on YCP Leaders : అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించి చెప్పిన ఘనులు.. వైసీపీ నేతలని టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టులను వివాదాల్లోకి నెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.

Dhulipalla fires on cm Jagan
Dhulipalla fires on cm Jagan
author img

By

Published : Nov 29, 2022, 7:08 PM IST

Dhulipalla fires on cm Jagan : ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఆ చలిమంటల్లో తన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించి చెప్పిన ఘనులు వైసీపీ నేతలని ధ్వజమెత్తారు. ఏ వ్యవస్థలనైనా నియంత్రించగలమనే ధైర్యంతో ఉన్న వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు తన తీర్పుతో అడ్డుకట్ట వేసిందని తెలిపారు.

జగన్మోహన్​రెడ్డి సీఎం అయ్యాక రాజధానికి చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టులను వివాదాల్లోకి నెట్టి పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఏపీకి రాజధాని లేని రాష్ట్రం అని గుర్తింపు తెచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు.

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రభుత్వ ప్రేరేపిత ఉద్యమం జరుగుతుందన్నది సుస్పష్టమన్నారు. అమరావతిలోనే హైకోర్టు కొనసాగుతుందని సుప్రీంకోర్టులో చెప్తూ.. కర్నూలులో ఏర్పాటు చేస్తామని ప్రజల్ని మోసగిస్తున్నారని ఆక్షేపించారు.

అమరావతిపై సుప్రీం తీర్పును వక్రీకరించిన ఘనులు వైసీపీ నాయకులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.