ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ - సంక్రాంతి కానుకగా కొత్త రేషన్​ కార్డులు, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే? - NEW RATION CARDS IN AP

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం - డిసెంబర్ 2 నుంచి 28 వరకూ అప్లికేషన్స్‌ స్వీకరణ - సంక్రాంతిలోపు పక్రియ పూర్తి

New Ration Cards In AP
New Ration Cards In AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 2:19 PM IST

New Ration Cards In AP : రాష్ట్రంలో రేషన్ కార్డుకు అర్హులైన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావడంతో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది అర్హులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్‌ కార్డులు మంజూరు కోసం ప్రభుత్వం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డులకు మొదట దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అనంతరం కార్డుల మంజూరు చేయబోతున్నారు.

సంక్రాంతిలోపు ఈ కొత్త రేషన్ కార్డులు : ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి 28 వరకూ అప్లికేషన్స్‌ స్వీకరణ ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల విభజన, మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తారు. తరువాత సంక్రాంతిలోపు ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హుల గుర్తింపు పక్రియ పూర్తి చేస్తారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తారు.

కొత్త జంటలకూ రేషన్ కార్డు - కుటుంబ సభ్యుల చిత్రాలతో సరికొత్తగా!

అన్నింటికీ రేషన్ కార్డులే : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుతో పాటు, ఉన్న వాటి సవరణకు అవకాశం కల్పిస్తూ డిసెంబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు పింఛను మంజూరు చేయాలన్నా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలన్నా, దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా ప్రాథమికంగా బియ్యం కార్డు కలిగి ఉండాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇవి తప్పకుండా ఉండాలి.

పెద్ద ఎత్తున విమర్శలు : ఇంతటి కీలకమైన కార్డుల మంజూరును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకూ అవకాశం ఇవ్వకపోవడంతో వేలాది మంది సంక్షేమ పథకాల లబ్ధికి దూరమయ్యారు. ఈ తప్పిదాన్ని సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న పాత కార్డులను కాదని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రాలు, ఆ పార్టీ గుర్తులతో ముద్రించి ఇచ్చారు. ఇందుకోసం చాలా డబ్బులు వృథా చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం : అప్పట్లో కొత్తవి ఇవ్వకపోగా ఆరంచెల విధానంలో వడపోసి అప్పటికే ఉన్న కార్డులను తొలగించారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం జరిగితే విభజన చేసుకునేందుకూ అనుమతి ఇవ్వలేదు. పేర్ల తొలగింపు, చేర్పులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో అప్పట్లో ప్రభుత్వ సంక్షేమ, రాయితీ పథకాలేకపోయారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంతో బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గుడ్​న్యూస్ - డిజిటల్‌ కార్డులు కొలిక్కి రాగానే 'కొత్త రేషన్​కార్డులు'

ఏపీలో ట్రాన్స్‌జెండర్లకు స్వయం సహాయక బృందాలు- ప్రత్యేకంగా రేషన్ కార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.