తెదేపా నేత దియ్యా రామకృష్ణకు బెయిల్ మంజూరు అయింది. పోలీసులు ఆయనను జడ్జి ముందు హాజరుపరచగా..పోలీసుల తీరును న్యాయమూర్తి తప్పుపట్టారు. హైకోర్టు స్టే ఉన్నా ఎందుకు అరెస్టు చేశారని జడ్జి ప్రశ్నించారు. 41 నోటీసు ఇచ్చి పంపితే సరిపోయేది కదా అని న్యాయమూర్తి తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని నిన్న ఉదయం పోలీసులు...దియ్యా రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని..
పిడుగురాళ్లకు చెందిన తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దియ్యా రామకృష్ణను పట్టణ పోలీసులు ఆదివారం గుంటూరులో అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం మీద సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టులు పెట్టారని గత నెలలో పట్టణ పోలీసులు కేసులు పెట్టారు. పట్టణ పోలీసులు గుంటూరు వెళ్లి అక్కడ రామకృష్ణను అరెస్టు చేసి వాహనంలో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తెదేపా నేతలు, కార్యకర్తలు పట్టణ పోలీసుస్టేషన్‌కు దగ్గరకు వచ్చి నిరసన తెలిపారు. స్టేషన్ దగ్గర ఎవరూ ఉండవద్దని పోలీసులు హెచ్చరించటంతో అక్కడి నుంచి పార్టీ కార్యాలయం దగ్గర వెళ్లారు. దీనిపై పట్టణ సీఐ కె.ప్రభాకరరావు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం వల్ల ఆయనపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. దీంతో పాటు మరో పాత కేసు కూడా ఉండటంతో అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చామని చెప్పారు.
ఇదీ చదవండి:
GOVERNOR TAMILISAI: పవన్ కల్యాణ్‌ను అభినందించిన తెలంగాణ గవర్నర్
ఇదీ చదవండి: స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తెరతో మెడపై దాడి..