ETV Bharat / state

'సుప్రీం కోర్టు తీర్పునూ వైకాపా వక్రీకరిస్తోంది'

author img

By

Published : Mar 19, 2020, 5:38 PM IST

ఎన్నికల కమిషనర్ తన భద్రతపై ఆందోళన చెందుతున్నారంటే... రాష్ట్రంలో ఎలాంటి పాలన ఉందో స్పష్టం అవుతుందని తెదేపా నేత ఆలపాటి రాజా విమర్శించారు. ఎన్నికల వాయిదాపై సుప్రీం ఇచ్చిన తీర్పును వైకాపా వక్రీకరించిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు అంతే లేదన్న ఆయన... ఎన్నికల ప్రక్రియను తిరిగి మొదటి నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Alapati rajendraprasad
ఆలపాటి రాజేంద్రప్రసాద్
మీడియాతో మాట్లాడుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్

స్థానిక ఎన్నికల వాయిదాపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీంతీర్పునూ వైకాపా తప్పుదోవ పట్టిస్తుందని... తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... కరోనా నియంత్రణకు ఎన్నికలు వాయిదా వేయటాన్ని సుప్రీం సమర్ధించిందన్నారు. మళ్లీ ఎన్నికలపై నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని సుప్రీం చెప్పిందన్నారు. వైకాపా నేతలు మాత్రం ప్రభుత్వ అనుమతి తర్వాతే ఎన్నికలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ అక్రమాలకు అంతే లేకుండా పోయిందని... అందుకే ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదటి నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

రెచ్చగొట్టేలా వైకాపా తీరు...

మద్యం, డబ్బుతో పట్టుబడితే కఠిన శిక్షలంటూ తెచ్చిన ఆర్డినెన్స్ అధికార పార్టీకి లబ్ధిచేయటం కోసమేనని రాజా ఆరోపించారు. అధికార పార్టీ నేతల వద్ద డబ్బు, మద్యం పట్టుబడినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపటం ఏం న్యాయమని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కమిషనర్​ను ముఖ్యమంత్రి కులం పేరుతో దూషించటం ఏమిటని నిలదీశారు. ఎన్నికల కమిషనర్ తనకు భద్రత లేదని ఆందోళన చెందటం చూస్తుంటే... రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంచే పేరిట అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి : రమేశ్​కుమార్ వెంటనే రాజీనామా చేయాలి: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.