ETV Bharat / state

దళితుల పేరుతో వైకాపా నేతల భూ దోపిడీ: జీవీ ఆంజనేయులు - దళితుల పేరుతో వైకాపా నేతల భూ దోపిడి

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో అనర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయించి.. దళితులకు దక్కాల్సిన భూములను వైకాపా నేతలు కాజేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

దళితుల పేరుతో వైకాపా నేతల భూ దోపిడి
దళితుల పేరుతో వైకాపా నేతల భూ దోపిడి
author img

By

Published : Oct 30, 2021, 10:50 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, ఈపూరు మండలాల్లో దళితుల పేరుతో వైకాపా నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. అనర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయించి దళితులకు దక్కాల్సిన భూములను వైకాపా నేతలు కాజేస్తున్నారన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ.. గుంటూరు జాయింట్ కలెక్టర్​ దినేశ్ కుమార్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

బొల్లాపల్లి, ఈపూరు మండలాల్లో అర్హులైన పేదలకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వటానికి ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెవిన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా పట్టాదారు పాసు పుస్తకాల్లో పేర్లు మార్చారన్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా బినామీ పేరుతో భూములు రాయించుకున్నాడన్నారు. వినుకొండ నియోజకవర్గంలో జరిగిన భూ దోపిడిపై విచారణ చేయాలని జేసీని కోరారు. దళితుల పేరుతో భూములు దోచుకున్న వైకాపా నేతలను, అవినీతికి పాల్పడిన అధికారాలపై చట్టపరమైన చర్యులు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి

అధికారంలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయలేకపోతున్నా: వైకాపా కౌన్సిలర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.