TDP Book on AP Fibernet Project Facts: 'ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టు వాస్తవాలు - జగన్‌రెడ్డి ముఠా అబద్ధపు ఆరోపణలు' పేరిట పుస్తకాన్ని తెలుగుదేశం నేతలు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్, సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు విడుదల చేసిన ఆ పుస్తకంలో వివిధ అంశాలను సవివరంగా పేర్కొన్నారు.
ఏపీ ఫైబర్‌నెట్ (AP FiberNet) నెలకు 149కే ఇంటికి ఇంటర్నెట్, ఫోన్, టీవీ ఛానళ్ల సౌకర్యం కల్పించామని పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. ఏపీ ఫైబర్‌నెట్ విధానాన్ని అనుసరించాలని ఇతర రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని.. కోట్ల రూపాయలు ఖర్చు కళ్లముందే కనపడుతుంటే ఆరోపణలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా జగన్‌రెడ్డి ముఠా చేసే రాజకీయ కుట్ర కాక మరేమిటని ప్రశ్నించారు.
ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై చేసిన ఖర్చు 280 కోట్ల రూపాయలు, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 900 కోట్ల రూపాయలు నిజమైతే, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణ పచ్చి అబద్ధమని తెలుగుదేశం తేల్చిచెప్పింది. అంటూ పుస్తకంలో పేర్కొన్నారు. విజయవంతమై, ప్రజలకు మేలు చేసిన ప్రాజెక్టుపై నిందలు వేయడం రాజకీయ కుట్రేనని ధ్వజమెత్తింది. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్టే 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా లూటీ చేసిన జగన్ మోహన్ రెడ్డికి అంతా అవినీతిపరులుగా కనిపిస్తున్నారని తెలుగుదేశం నేతలు దుయ్యబట్టారు.
Skill Development-Inner Ring Road Facts: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఇన్నర్ రింగ్‌రోడ్డులపై ప్రభుత్వం వింత ఆరోపణలు.. వాస్తవాలు ఇవిగో
రూ.5,598 కోట్లు ఖర్చుకాగల ఫైబర్‌నెట్ ప్రాజెక్టును వినూత్న ఆలోచన, కఠోర శ్రమతో రూ.280 కోట్లతోనే పూర్తి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రశంస కూడా దక్కిందని గుర్తుచేసింది. 10 లక్షల గృహాలు, 9 వేల వ్యాపార సంస్థలు, 3 వేల సూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, నేటి గ్రామ, వార్డు సచివాలయాల వరకు ఫైబర్‌నెట్ కనెక్షన్‌లు ఇవ్వడం ఒక రికార్డు అని తెలిపింది. నెలకు రూ.149కే ఇంటర్‌నెట్, ఫోన్, టీవీ ఛానళ్ల సౌకర్యం కల్పించామని వెల్లడించింది. ఏపీ ఫైబర్‌నెట్ విధానాన్ని అనుసరించమని ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సూచనలు చేసిందని టీడీపీ గుర్తుచేసింది. నాసిరకం మెటీరియల్ వేసి వందల కోట్లు అవినీతి చేశారనే జగన్‌రెడ్డి ముఠా ఆరోపణలు పచ్చి అబద్ధమని స్పష్టం చేసింది. జగన్ రెడ్డి చేసిన తప్పులకు ప్రజలు శ్రీలంక తరహాలో తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తారనే భయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ని జైల్లో పెట్టారు తప్ప ఆయన ఎలాంటి అవినీతి చేయలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు. తెలుగుదేశం హయాంలో ప్రజలకు ఉపయోగపడే మూడు అంశాలపై కేసులు వేశారని ఆక్షేపించారు.