SC ON AMARAVATI PETITIONS: రాష్ట్ర విభజన కేసులు, అమరావతి రాజధాని కేసుల విచారణ.. విడివిడిగానే జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. రెండు కేసులనూ.. విడివిడిగానే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. ధర్మాసనాన్ని కోరారు. హైకోర్టులో రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారంటూ.. కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ దశలో జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్‌ల ధర్మాసనం జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యేంత వరకూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లపై.. రైతులు ఒత్తిడి తీసుకురాకపోవచ్చని న్యాయామూర్తులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదంటూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని విషయాలను ప్రభుత్వ తరపు న్యాయవాది వైద్యనాథన్.. ధర్మాసనానికి వివరించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరగా.. ఈనెల 28నే అన్ని అంశాలు పరిశీలిస్తామంటూ ధర్మాసనం ప్రకటించింది.
ఇవీ చదవండి: