గుంటూరు జిల్లా బాపట్లలో సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జిలానీ అనే వ్యక్తిని హత్య చేసేందుకు మూకిరి రాజా అనే మరో వ్యక్తి ఆ ముఠాని రప్పించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు కుట్ర పన్నినట్లు సమాచారం వచ్చిన కారణంగా... పక్కా ప్రణాళికతో శీలం వారి వీధిలో కిరాయి ముఠా ఉన్న ఇంటిపై దాడి చేసినట్టు చెప్పారు. జిలానీ, రాజా గతంలో స్నేహితులనీ.. ఆర్థిక వ్యవహారాల్లో తేడా వచ్చి విడిపోయారని అన్నారు.
కొద్ది నెలల క్రితం రాజాపై దాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు జిలానీని అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్ పై జిలానీ బయటకు వచ్చాడు. విషయం తెలుసుకున్న రాజా... జిలానీని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం భారీ మొత్తంలో నగదు ఇచ్చి.. ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే రాజా కదలికలపై కన్నేసి అతడు చేసిన కుట్రను ఛేదించాం.. అని బాపట్ల పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: