గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన భవనాన్ని ఆమె ప్రారంభించారు. దాత బొమ్మిడాల కృష్ణమూర్తి సహకారంతో 40 లక్షల ఖర్చుతో ఈ పాఠశాలను నిర్మించినట్టు తెలిపారు. భారతదేశంలో 27 శాతం నిరక్షరాస్యత ఉంటే....ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 33 శాతం ఉండటం బాధాకరమన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో చదువుకోలేకపోయాము అనే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి అక్టోబర్ నెల నుంచి 15 వేలు చొప్పున ప్రభుత్వం అందించనుంది. గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని...అయితే వ్యాపారమే ధ్యేయంగా మార్చుకున్న ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని....ఆడపిల్లలు ఎంత ఎక్కువ మంది చదువుకుంటే సమాజం అంత అభివృద్ధి చెందుతుందన్నారు. బాలికలపై అత్యాచారాలు తగ్గించేందుకు అన్ని పాఠశాలల్లో కరాటే విద్యపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
ఇవీ చదవండి