Annadanam Digital Tokens In Bhadrachalam : భద్రాచల రామాలయంలో అన్నదానం టోకెన్ల జారీ ప్రత్యేకతను చాటు కుంటుంది. ఇంతకు ముందు క్యూలో వేచి ఉన్న భక్తులకు పరిమిత సంఖ్యలో అన్నదానం టికెట్లను ఇచ్చేవారు. నవంబరు 13 నుంచి అన్నదానం డిజిటల్ టోకెన్లను ఇస్తున్నారు. క్యూఆర్ కోడ్ ఉంటుంది. అలాగే భక్తులు తీసుకున్న ఫొటోతో కూడిన టోకెన్‌ను ఇస్తున్నారు. ఈ టోకెన్‌ను అన్నదాన సత్రంలో చూపించి భోజనం చేయవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
అన్నదానం డిజిటల్ టోకెన్లు : మధ్నాహ్నం రెండు గంటల వరకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో రోజుకు 1,500 మంది నుంచి 2,000 మంది అన్నదానం స్వీకరిస్తున్నారు. ఈ విధానంతో అన్నదాన ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా సాగుతోందని నిర్వాహకులు అంటున్నారు. ఇదే విధంగా ప్రొటోకాల్ దర్శనాల్లో సైతం డిజిటల్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దీనిలో ఇచ్చిన వారి వివరాలతో పాటు దర్శనానికి వచ్చిన వారి ఫొటోలను డిజిటల్ టోకెన్‌లో పెడుతున్నారు.
వచ్చే ఏడాది శ్రీసీతారాముల కల్యాణం ఎప్పుడంటే?
TTD Arrangements For Vaikunta Dwara Darshan : తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు రోజుకు దాదాపు 70వేలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
300 రూపాయల స్పెషల్ ప్రవేశ దర్శనం టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో విడుదల చేసిన టీటీడీ రోజుకు 40 వేల టికెట్ల చొప్పున పది రోజులకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా టికెట్లను జారీ చేయనుంది. ఈ దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే క్యూలైన్లలోకి అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏకాదశి మొదలు పది రోజుల పాటు శ్రీవారి దర్శనం ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ చేస్తోంది. ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో వెంకన్న చౌదరి పరిశీలించారు.