Stampede at Jagan Praja Darbar Program: వైఎస్సార్ జిల్లా పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో తోపులాట జరిగింది. 3వ రోజు పర్యటనలో భాగంగా జగన్ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జగన్ రావడానికి ముందే క్యాంపు కార్యాలయానికి ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు వినతులు ఇవ్వడానికి తరలివచ్చారు. జగన్ రాగానే అందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ సమయంలోనే వారిని పోలీసులు అదుపు చేయలేకపోయారు. అందరూ ఒక్కసారిగా వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో కార్యాలయం అద్దాలు పగిలిపోయాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారందరిని చెదరగొట్టి పంపించారు. వినతులు ఇవ్వటానికి వచ్చినవారు క్యూ లైన్లో ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కాగా క్యాంపు కార్యాలయం వద్ద జగన్ నిర్వహించే ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఘటనలు జరుగడం చర్చనీయాంశంగా మారింది.
'విద్యుత్ ఛార్జీలను పెంచాలని సిఫార్సు చేసింది జగనే - ఇది తుగ్లక్ చర్యలకు పరాకాష్ట'
ఏపీలో భారీ 'మద్యం కుంభకోణం'! - ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం