ETV Bharat / state

accident: కొత్త బట్టలు కొనేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు - tenali lorry byke road accident

క్రిస్మస్ పండుగకు నూతన వస్త్రాలు ధరించాలనుకున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి ద్విచక్ర వాహనంపై పట్టణానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడిడక్కడే మృత్యువాత పడగా.. ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.

student died in road accident in guntur
student died in road accident in guntur
author img

By

Published : Dec 23, 2021, 3:21 AM IST

క్రిస్మస్ పండుగకు నూతన వస్త్రాలు ధరించాలనే ఆకాంక్షతో ఆ ముగ్గురు యువకులు తెనాలి వచ్చి బట్టలు కొనుగోలు చేసి తమ ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మృత్యువు లారీ రూపంలో వచ్చింది. ఈ ప్రమాదంలో మూల్పూరి రోహిత్ (16) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఇచ్చి అనంతరం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు.

కుటుంబ సభ్యులు, స్థానికుల చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం మూల్పూర్ గ్రామానికి చెందిన రోహిత్ కుమార్ (16), ఉప్పలపాటి సన్నీ, ఎర్రగుంట్ల సాయి అనే ముగ్గురు యువకులు నూతన వస్త్రాలు కొనుగోలు చేయడానికి తెనాలి వచ్చారు. బట్టలు కొనుగోలు చేసి తిరిగి తమ ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా.. జగ్గడిగుంట పాలెం సమీపంలో పక్కనే వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో లారీ వెనుక చక్రాల కింద రోహిత్ కుమార్ పడ్డాడు. వేగంగా వెళ్తున్న లారీ అదుపు కాకపోవడంతో చక్రాల కింద పడ్డ రోహిత్​ని పది మీటర్ల మేర రోడ్డు కేసి ఈడ్చుకు వెళ్లింది. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు సొమ్మసిల్లి పడిపోవడంతో తెనాలి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉప్పలపాటి సన్నీ, ఎర్రగుంట్ల స్థాయిలను తొలుత తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించి అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్​ను వెంటనే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గ్రామీణ రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. లారీ డ్రైవర్, యజమాని ఘటనాస్థలానికి రావాలని.. తగిన హామీ ఇవ్వడంతోనే నిరసన విరమిస్తానని బిల్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తేల్చి చెప్పారు. నిరసన కొనసాగుతూనే ఉంది.

ఇదీ చదవండి: murder case: నెల్లూరులో దారుణం.. వ్యక్తిని పొడిచి చంపిన స్నేహితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.