suicide:గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో స్నేహ సరన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన స్నేహ సరన్... ఫుడ్ టెక్నాలజీలో మూడో సంవత్సరం అభ్యసిస్తూ...ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటోంది. ఆదివారం రాత్రి తను నివాసం ఉంటున్న ఇంటి నాలుగో అంతస్తు పిట్టగోడ నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. కోన ఊపిరితో ఉన్న ఆమెను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొంతసేపటికి ఆమె మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: అయ్యో హంస నందిని.. ఈ పెద్ద రోగం నీకు తగిలిందా!