నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఓ బేకరీ ఆధ్వర్యంలో కేకుల ప్రదర్శన జరిగింది. సామాజిక మాధ్యమాల లోగోలతో కూడిన కేకులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బంధుమిత్రులతో అనుసంధానమయ్యేందుకు మనం ఎక్కువగా ఉపయోగించే.. ఫేస్ బుక్, వాట్సప్‌లతో పాటు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లోగోలతో కూడిన కేకులు ఆకట్టుకుంటున్నాయి. తెనాలి పట్టణంలోని శశి బేకరీ సంస్థ 30 సంవత్సరాల నుంచి ప్రతీ సంవత్సరం కేకుల ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈసారి ఏర్పాటు చేసిన ప్రదర్శనను తెనాలి డీఎస్పీ ప్రశాంతి రాయ్ ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల లోగోలతో ఉన్న కేకులు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రప్రభుత్వం పేదలకు నిర్మించబోతున్న ఇంటి నమూనాతో తయారు చేసిన కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
యానంలో సరికొత్త కేకులు..
యానంలో 2021 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వివిధ ఆకారాల్లో రంగురంగుల కేకులను కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. పావు కేజీ నుండి పాతిక కేజీల వరకు బరువుండే ఈ కేకులు 200 నుండి 2000 వరకు ధర పలుకుతున్నాయి. వివిధ విభాగాల్లోని ఉన్నతాధికారులకు నూతన సంవత్సర కానుకగా ఇచ్చేందుకు సిబ్బంది వీటిని కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ న్యూయర్ కేక్‌లు.. కేక!