యువతితో అనుచిత ప్రవర్తన ఆరోపణలతో... గుంటూరు అరండల్ పేట ఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్ సీహెచ్ రామును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ యువకుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసిన తనతో పాటు తన తల్లితో...ఎస్సై, కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించారని యువతి ఆరోపించింది. గత నెల 31న... తనపై ఎస్సై బలాత్కారం చేశాడంటూ... హోంమంత్రి సుచరిత, ఎస్పీ కార్యాలయాలను ఆశ్రయించింది. వారు కేసును గుంటూరు తూర్పు డీఎస్పీ సుప్రజకు బదిలీ చేయగా... తాజాగా అధికారులు చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్లతో పాటు.. చట్టవిరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణపై మరో కానిస్టేబుల్ హనుమంతరావును విధుల నుంచి బహిష్కరించారు.
ఇవీ చదవండి:
చంపుతాడనే భయంతో..తండ్రిని చంపేశాడు