గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన ఓ యువతి.. గుంటూరులో మార్ట్ క్యాషియర్‌గా పని చేస్తోంది. గతేడాది డిసెంబరులో పండగ కోసం ఆమె స్వస్థలానికి వచ్చింది. గ్రామంలో మత పెద్దగా వ్యవహరిస్తున్న మాయకుంట్ల బాలస్వామి.. చిన్నారులకు భక్తిగీతాలకు నృత్యాలు నేర్పించాలని యువతిని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించి ఏడాదిగా సహజీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని కోరితే నిరాకరించాడని, అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
ఇదీచదవండి.