ETV Bharat / state

Schools Reopening in AP: రేపటి నుంచి స్కూల్స్​ రీ ఓపెన్​.. విద్యార్థులకు స్వాగతం పలకనున్న సమస్యలు

author img

By

Published : Jun 11, 2023, 8:48 AM IST

Schools Reopening Problems: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలతో పాటు.. విద్యార్థులకు సమస్యలూ పునఃప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ.. ఉన్నత పాఠశాలల్లోకి 3, 4, 5 తరగతుల విలీనం.. పెరిగిన ఏకోపాధ్యాయ బడులు విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. పాఠశాలల నిర్వహణకు నిధులను విడతల వారీగా విడుదల చేస్తున్నందున.. రిజిస్టర్లు, చాక్‌పీసులు కొనుక్కునేందుకూ డబ్బుల్లేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులూ పూర్తి కాలేదు. తాగునీటి ఫిల్టర్ల బిగింపు పూర్తికానందున రక్షిత మంచినీరు లభించే పరిస్థితి లేదు. పాఠశాలల ఆవరణలు, గదుల్లో నిర్మాణ సామగ్రి నిల్వతో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

Schools Reopening Problems
Schools Reopening Problems
రేపటి నుంచి స్కూల్స్​ రీ ఓపెన్

Schools Reopening Problems: హేతుబద్ధీకరణ కారణంగా రాష్ట్రంలో 12 వేలకు పైగా స్కూళ్లు.. ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో ఊరిలోని బడి ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా గత సంవత్సరం 3.98 లక్షల మంది ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. తరగతుల విలీనం, హేతుబద్ధీకరణ ఈ సంవత్సరం ప్రవేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

పాఠశాలలు తెరిచే లోపు నాడు-నేడు పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అవి అసంపూర్తిగానే ఉన్నాయి. రెండోవిడత పనులు చేపట్టి 20 నెలలు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాణ సామగ్రిని ఆవరణలో పడేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడనున్నారు. నాడు-నేడుకు నిధులు సకాలంలో ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది. రెండోవిడతకు మొదట్లో నిధులు ఇవ్వకపోవడంతో ఐదారు నెలలు పనులు నిలిచిపోయాయి. మార్చిలో నిధులు విడుదల చేయగా.. ఏప్రిల్‌ నుంచి పరీక్షలు రావడంతో పనులు జరగలేదు. కొన్నిచోట్ల సిమెంటు బస్తాలను బడుల్లోనే నిల్వచేశారు. ఇలాంటిచోట గదుల కొరత ఏర్పడనుంది. చాలా బడుల్లో అదనపు గదులు పూర్తి కాలేదు. వీటికి తీసుకొచ్చిన సామగ్రి వృథాగా ఉంది. మూడు విడతల్లో అన్ని పాఠశాలల్లో వసతులు కల్పిస్తామన్న ప్రభుత్వం.. రెండో విడత పూర్తి చేసేందుకే ఆపసోపాలు పడుతోంది.

విద్యార్థులకు బడుల్లో టాయిలెట్లు అవసరం. కొత్త నిర్మాణాలు, మరమ్మతుల కోసం కొన్నిచోట్ల ఉన్నవాటినీ పని చేయకుండా చేశారు. 14వేల 76 పనులు మంజూరు కాగా.. ఇప్పటికీ 52శాతం మాత్రమే ఖర్చు చేశారు. తరగతి గదుల మరమ్మతులు 14 వేల 25 పాఠశాలల్లో చేయాల్సి ఉండగా.. 2 వేల 348 మాత్రమే పూర్తి చేశారు. వంటగదులు 9వేల 226 నిర్మించాల్సి ఉండగా.. ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. విద్యుదీకరణకు 28.71శాతం వ్యయమే చేశారు.

22వేల 344 పాఠశాలలు, వసతిగృహాలు, జూనియర్‌ కళాశాలల్లో పనులు చేపట్టాలని నిర్ణయించగా.. అదనపు తరగతి గదులు, ప్రహరీల నిర్మాణాలు వాయిదా వేయడంతో ఈ సంఖ్య 14 వేల 25కు తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 9,226 తరగతి గదులు కట్టాల్సి ఉండగా.. వీటిని మధ్యలోనే వదిలేశారు. మొదట గత సంవత్సరం జులైనాటికి పనులు పూర్తి చేస్తామని ప్రకటించి, తర్వాత ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఇప్పుడు జూన్‌ 12 నాటికి పూర్తి చేస్తామని చెప్పినా పూర్తి కాలేదు. డిసెంబరుకు వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తోంది.

విద్యాకానుక కిట్లలో 1.50 లక్షల బ్యాగ్‌లు ఇంకా జిల్లా కేంద్రాలకు చేరాలి. పాఠ్యపుస్తకాలు ఇప్పుడిప్పుడే చేరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 39లక్షల 95 వేల 992 మంది విద్యార్థులుండగా.. కొత్తగా వచ్చేవారి కోసమంటూ అదనంగా 43లక్షల 10వేల 165 కిట్లు సిద్ధం చేస్తున్నారు. బూట్ల సైజుల్లోనూ ఇబ్బందులు ఏర్పడనున్నాయి. పాదాల కొలతలు తీసుకునేటప్పుడు బడికి రాని పిల్లలకు ఏదో ఒక కొలత వేసేశారు. నవంబరుకు ముందే కొలతలు తీసుకోవడంతో, ఇప్పుడు తేడాలు వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా 85వేల మంది దరఖాస్తు చేస్తే 50వేల మంది కొత్త బడులకు వెళ్లాల్సి వస్తుంది. 45వేల మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తు చేశారు. సబ్జెక్టు టీచర్లు, ఎస్జీటీలు ఒక్కరే ఉంటే అక్కడికి కొత్తవారు వచ్చేవరకూ పాతవారిని రిలీవ్‌ చేయొద్దని జిల్లా విద్యాధికారులు ఆదేశించారు. కొత్త టీచర్‌ వచ్చిన పాఠశాలలో బోధనకు పని లేకపోతే అవసరమైన చోటకు మార్చాలని విద్యాశాఖ కమిషనరేట్‌ ఆదేశించింది. 2 వేల 900 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీకావడంతో అక్కడ విద్యాకానుక కిట్ల అందజేతపై ప్రభావం పడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.