Sanitation Worker Vimala Rani suicide Attempt: వైఎస్సార్సీపీ నాయకులు వేధింపులకు గురి చేస్తుండంతో పారిశుద్ధ్య కార్మికురాలు విమల రాణి ఆత్మహత్యాయత్నం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విమల రాణిను విపక్ష పార్టీ నేతలు, మహిళా జిల్లా తెలుగు మహిళా సంఘ అధ్యక్షురాలు అన్నా బత్తిన జయలక్ష్మి, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్, సీపీఐ పార్టీ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పరామర్షించారు. ఈ ఘటనపై వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు తీరుపై తీవ్రంగా స్పందించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే సరైన బుద్ది చెపుతామని వారు హెచ్చిరించారు.
విమల రాణిని విధుల నుంచి తొలగింపు : గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న 45వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ మారుతి, ఆమె భర్త కోటి రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్లను సంక్షేమ పథకాలేవి అందటం లేదని గుంటూరు పారిశుద్ధ్య కార్మికురాలు విమల రాణి అడిగినందుకు ఆమెపై కక్షపూరితంగా వ్యవహరించి పారిశుద్ధ్య కార్మికురాలిని విధుల నుంచి తొలగించారని జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మహత్యాయత్నంకు కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకొని, కోలుకోగానే ఆమెను విధుల్లోకి చేర్చుకోవాలని నేరెళ్ళ సురేష్ డిమాండ్ చేశారు.
ప్రశ్నించే వారి గొంతును నొక్కుతున్న అధికార ప్రభుత్వం : వైఎస్సార్సీపీ మహిళా సాధికారత పేరుతో మహిళలపై దాడులు చేయడం హత్యలు, మానభంగాలు చివరకు ఆత్మహత్యలను ప్రేరేపించడమేనా ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి అని గుంటూరు జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ దాష్టికంతో ఆత్మహత్యాయత్నం చేసిన విమలారాణిని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి, ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి కంబపాటి శిరీషా మాట్లాడుతూ ప్రశ్నించే వారిని వైఎస్సారీపీ ప్రభుత్వం గొంతు నొక్కుతుందని అన్నారు. ఇదే తంతుగా వ్యవహరిస్తే ఏ ప్రజల అండతో మీరు అధికారంలోకి వచ్చారో అదే ప్రజలు మీ అధికారాన్ని కూలదోస్తారని కంబపాటి కంబపాటి శిరీషా హెచ్చరించారు.
మెరుగైన వైద్యం అందించి, విధుల్లోకి తీసుకోవాలి : వైఎస్సార్సీపీ పథకాలు రావడం లేదని ప్రశ్నించినందుకు విధుల నుంచి తొలగించడం దారుణం అని సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పేర్కొన్నారు. తక్షణమే అధికారులు విమల రాణికి మెరుగైన వైద్యం అందించి, కోలుకున్నాక ఆమెను విధుల్లోకి చేర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి