ETV Bharat / state

పెండింగ్​ జీతాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. అరెస్టు - గుంటూరులో జీతాలు పెంపుకై పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

జీతాలు చెల్లించాలని కోరుతూ.. గుంటూరు జిల్లా మందడంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

sanitary workers protest over salary's
జీతాలు పెంపుకై పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
author img

By

Published : Jan 11, 2021, 4:51 PM IST

Updated : Jan 11, 2021, 7:39 PM IST

పెండింగ్​ జీతాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. అరెస్టు

పెండింగ్​ జీతాలు చెల్లించాలని కోరుతూ.. గుంటూరు జిల్లా మందడంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. సుమారు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరనస వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కార్మికులు, పోలీసులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. తమ జీతాలు చెల్లించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కార్మికులు భీష్మించుకొని కూర్చున్నారు. అదనపు బలగాలను రప్పించి కార్మికులను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

ఇదీచదవండి: జస్టిస్ ఈశ్వరయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Last Updated : Jan 11, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.