పాలసేకరణ, అమ్మకాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు.. సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో.. ఆ సంస్థ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. నూతన సంవత్సరం నుంచి పాడి రైతులకు లీటరుకు రూ. 64 చెల్లించే విధంగా ధరలను పెంచినట్లు పేర్కొన్నారు. రైతుల భాగస్వామ్యంతో 100 ఎకరాల్లో సైలేజ్ గడ్డిని పెంచేందుకు బోర్డు తీర్మానించిందని వెల్లడించారు.
సంగం ఉత్పత్తుల చెన్నై మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా నెల్లూరు, చిత్తూరు పరిసరాల్లో.. నూతన ప్యాకింగ్ కేంద్రం ఏర్పాటుకు బోర్డు సభ్యులతో చర్చించినట్లు నరేంద్ర తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి, కొండమోడు, రొంపిచర్లలో చిల్లింగ్ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. డెయిరీలో పనిచేసే మహిళల భద్రత కోసం.. ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: