గుంటూరు జిల్లా వినుకొండలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ పథకాలకే ఇసుక తరలిస్తున్నామని చెబుతూ.. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో అక్రమార్కులు ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు వందల కొద్ది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఇసుక అక్రమ రవాణా అంశాన్ని నూజెండ్ల ఎమ్మార్వో ఎలీషా బాబు దృష్టికి తీసుకెళ్లగా..సంబంధిత వీఆర్వోకు ఇసుక రీచ్‌లపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీచదవండి
Polavaram: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి డెల్టాకు నీటి విడుదల