ETV Bharat / state

రచ్చకెక్కిన ఇసుక దందా.. అధికారపార్టీ నేతల పరస్పర ఆరోపణలు.. కాకరేపుతున్న రాజకీయం - NGT

SAND MINING ISSUE VIRAL IN GUNTUR : ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీలో గుట్టుగా సాగిపోతున్న.. ఇసుక దందా రచ్చకెక్కింది. పెదకూరపాడు MLA శంకరరావు ఆధ్వర్యంలో ఇసుక దందా నడుస్తోందని.. ఆయన అనుచరుడు నాగేంద్రకుమార్ సంచలన ఆరోపణలు చేయగా.. ఇసుక రవాణాలో నిన్ను ఎన్నిసార్లు ఎమ్మెల్యే కాపాడలేదంటూ కొందరు ఎదురుదాడి చేయడం చర్చనీయాంశమైంది. జిల్లాలో.. ఇసుక తవ్వకాలపై ఆరోపణలు కొత్త చర్చకు దారితీసింది.

SAND MINING ISSUE VIRAL IN GUNTUR
SAND MINING ISSUE VIRAL IN GUNTUR
author img

By

Published : Mar 25, 2023, 9:09 AM IST

రచ్చకెక్కిన ఇసుక దందా.. అధికారపార్టీ నేతల పరస్పర ఆరోపణలు.. కాకరేపుతున్న రాజకీయం

SAND MINING ISSUE VIRAL IN GUNTUR : దండా నాగేంద్ర కుమార్.. పల్నాడు జిల్లా ధరణికోటకు చెందిన వైసీపీ నాయకుడు. పెదకూరపాడు MLA నంబూరు శంకరరావు అనుచరుల్లో ఒకరు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై.. గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన NGT.. ఇసుక తవ్వకాలు ఆపాలని.. జరిమానాలు విధించాలని ఆదేశించింది. ఐతే ఎమ్మెల్యే శంకర్రావు ఆదేశాలతోనే తాను NGTని ఆశ్రయించానని నాగేంద్ర కుమార్‌ వివరించారు. గతంలో జేపీ వెంచర్స్ సంస్థ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న MLA.. ఇప్పుడు తానే తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా.. జేపీ వెంచర్స్ ప్రతినిధుల్ని MLA బెదిరించిన వీడియోలను ఆయన బయటపెట్టారు.

ఐతే..ఇప్పుడు ఎమ్మెల్యేనే ఇసుక తవ్వకాలు చేస్తుండంతో.. గతంలో తాను NGTలో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని నాగేంద్రకుమార్‌ ఆరోపించారు. మాట వినలేదనే కక్షతో.. ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించారని వాపోయారు. MLA నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు.

"ఎమ్మెల్యే గారు ఒక్కటే చెపుతున్నాను. ఆ రోజు మీరు నన్ను భయపెట్టి కేసు పెట్టించారు. మళ్లీ ఈరోజు మీ పెంపుడు కొడుకు నంబూరి కల్యాణ చక్రవర్తి నాపై దాడులు చేస్తానని.. నన్ను భౌతికంగా లేకుండా చేస్తానని మీ ఇంట్లోనే హెచ్చరించాడు. ఈ కేసును వాపస్​ తీసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ దానికి నేను తలవంచను. కేంద్ర ప్రభుత్వం ప్రకారం 25 హెక్టార్ల లోపు ఉన్న వాటికి మాన్యువల్​గా ఇసుక తీయాలి. అంటే భారీ పరికరాలు వాడకూడదు. కానీ మన రాష్ట్రంలో 5 హెక్టార్ల లోపు హెవీ మెకానైజైడ్​తో తవ్వుతున్నారు"-దండా నాగేంద్ర కుమార్, ధరణికోట

మరో వైపు.. నాగేంద్రకుమార్ వ్యాఖ్యలను MLA శంకరరావు సన్నిహితులు ఖండించారు. నాగేంద్రే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. నాగేంద్రకు చెందిన ఇసుక లారీలను.. ప్రజలు అడ్డుకున్నారంటూ కొన్ని ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. NGTలో ఎమ్మెల్యేనే.. పిటిషన్ వేయించారనే ఆరోపణలపై అమరావతి ఆలయంలో ప్రమాణానికి సిద్దమా అని.. నాగేంద్రకు సవాల్ విసిరారు. వాటాల్లో తేడాలు రావడంతోనే అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుల ఇసుక దందా బయటికొచ్చిందని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

"వాళ్ల ఆటలు సాగనీయలేదని,వాళ్ల సంపాదనకు అడ్డువచ్చారని, అక్రమంగా చేసే పనులకు అడ్డుగా ఉన్నారనే కక్ష పెంచుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుటుంబసభ్యుల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. జేపీ వాళ్ల మీద కొట్లాటలకు పోయింది ఎవరూ.. వాళ్ల దగ్గర దోపిడీలు చేసింది ఎవరూ. ఇప్పుడు నీ దందాకు అడ్డువచ్చారని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం అన్యాయం"-కోటేశ్వరరావు, వైసీపీ నాయకుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.