విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ గుంటూరులో కార్మిక సంఘాలు ,వివిధ పార్టీల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా, సీపీఐ, సీపీఎంలతో పాటు పలు కార్మిక, రైతు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ఈ నెల 5న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నష్టాల పేరుతో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న కేంద్ర నిర్ణయాన్ని గుంటూరు తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ తప్పుబట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు తక్షణమే బొగ్గు గనులు కేటాయించాలని.. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకైన ఉక్కు పరిశ్రమను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి