గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కులలో ఓ మహిళపై అత్యాచారం చేసి నగదు దోచుకెళ్లిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ మహిళ సైతం ఉంది. జులై 2వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో నిడుముక్కల వద్ద ఓ మహిళ ఆటో కోసం వేచి చూస్తోంది. దీన్ని గమనించిన ఆటో డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులు, భార్యతో కలిసి ఆటోలో ఎక్కించుకున్నారు. తాను దిగవలసిన ప్రాంతం దాటి పోవడంతో మహిళ గట్టిగా కేకలు పెట్టింది. కేకలు వినిపించకుండా ఉండేందుకు.. ఎక్కువ సౌండ్‌తో పాటలు పెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కత్తితో బెదిరించి బంగారు గొలుసు, నగదును లాక్కున్నారు. తర్వాత ఆటో డ్రైవర్ రమేష్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
మహిళపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్ - తాడికొండ మండలం
మహిళపై అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను నేర విభాగం ఏఎస్పీ రాఘవ వివరించారు.