ETV Bharat / state

రెండు లారీలు ఢీ...డ్రైవర్ మృతి - గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్​కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నాదెండ్ల మండలంలో రోడ్డు ప్రమాదం
నాదెండ్ల మండలంలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Apr 25, 2021, 3:20 PM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్​కు తీవ్ర గాయాలయ్యాయి. నాదెండ్ల ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం కొల్క​త్తా నుంచి చెన్నైకి కెమికల్ లోడుతో మూడు లారీలు వరుసగా వెళ్తున్నాయి. ఆ వెనకే ఒడిశా నుంచి సేలంకు మరో లారీ వెళ్తోంది. గణపవరంలోని ప్రగతి పంక్షన్ హాలు వద్దకు రాగనే ముందు వెళ్తున్న లారీల వేగం నెమ్మదించాయి. వెనక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ.. కెమికల్ లారీని ఢీకొట్టింది. దీంతో లారీ క్యాబీన్ భాగం నుజ్జునుజ్జైంది. లారీ డ్రైవర్ అక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న నాదెండ్ల ఎస్సై సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకోని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఔరా: మూడు టన్నుల పాత ఐరన్ స్క్రాప్​తో 'జీపు' తయారీ

కరోనాను జయించిన వ్యక్తికి రూ. 5 కోట్ల జాక్​పాట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.