ETV Bharat / state

Rising Prices of Essentials: చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాల ధరలు.. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.200 - కందిపప్పు ధర పెంపు

Rising Prices of Essentials: పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవలే టమాట ధరలు అందివచ్చాయని సంతోషపడేలోపే.. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు 200 రూపాయలకు చేరుకుంది. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా కందిపప్పు అందించేవారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అరకొరగానే పంపిణీ చేస్తున్నారని కార్డుదారులు వాపోతున్నారు.

Rising Prices of Essentials
Rising Prices of Essentials
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 7:15 PM IST

Rising Prices of Essentials: చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాల ధరలు.. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.200

Rising Prices of Essentials: నిన్న మొన్నటి వరకు కూరగాయల ధరలతో అవస్థలు పడిన పేద, మధ్య తరగతి ప్రజలను.. ప్రస్తుతం కందిపప్పు ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కిలో కందిపప్పు రేటు బహిరంగ మార్కెట్‌లో 200 రూపాయలకు చేరడంతో.. ఏమి కొనేటట్టు లేదు ఏమి తినేటట్టు లేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో సామాన్యులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇంటి అద్దె, పన్నులు, కరెంటు బిల్లు, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుతో జీవనం సాగించడమే కష్టమవుతోందని ఆవేదన చెందుతున్నారు.

ఉన్నట్టుండి కందిపప్పు ధర అమాంతంగా పెరిగితే బతికేదెలా అని వాపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యావసర ధరలను అదుపు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ నేడు ఆ హామీని తుంగలో తొక్కారని మహిళలు వాపోతున్నారు. గ్రామాల్లో సరైన ఉపాధి లేక పట్టణాలు, నగరాలకు వలస వస్తున్న వేతన జీవులు నిత్యావసరాల పెరుగుదలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ధరలకు భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తే గానీ కుటుంబం గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Increased prices: ఈ బాదుడుకు సామాన్యులు బతికేదెలా.. భారీగా పెరుగుతున్న వంటింటి ఖర్చు

నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో వాటిని లాక్కుంటోందని పేదలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకే ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయని వాపోతున్నారు. రెండు వారాల క్రితం మొదటి రకం కందిపప్పు కిలో 145కు లభిస్తే ప్రస్తుతం 175 రూపాయలకు చేరిందని వివరిస్తున్నారు.

పప్పులు, బియ్యం వంటి కనీస అవసరాలైన సరుకులు ధరలు అందుబాటులో లేకపోతే ఏం తిని బతకాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయని ఆనందించిన కొద్ది రోజుల్లోనే పప్పులు, బియ్యం ధరలు చుక్కులు చూపిస్తున్నాయని వాపోతున్నారు. బలవర్థక ఆహారంగా చెప్పుకునే కందిపప్పు ధరపై ప్రభుత్వాల నియంత్రణ అవసరమని సామాన్యులు అభిప్రాయ పడుతున్నారు.

Petrol and Diesel Prices in Andhra Pradesh పెట్రోల్​ ధరలపై నాడు గగ్గోలు.. నేడు బాదుడు! పెత్తందారు పాలనలో ఇదో తరహా మోసం..

వారాల వ్యవధిలోనే కిలోపై 30 రూపాయలు ధర పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కందిపప్పు ధరతో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలపై ప్రభుత్వం నియంత్రణ విధించాలని పేద, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి కుటుంబానికీ పూర్తి స్థాయిలో కందిపప్పు, ఇతర నిత్యావసరాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

"ధరలు అన్నీ పెరిగినాయి. 500 రూపాయలవి తెచ్చుకున్నా సరిపోవడం లేదు. కరెంటు బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇంటి అద్దెలు కట్టుకుని మా లాంటి సామాన్య ప్రజలు బతకడం కష్టంగా ఉంది. నా భర్త ఆటో డ్రైవర్. తక్కువ డబ్బులే వస్తున్నాయి." - స్థానికురాలు

Gas Cylinder Price: కొండెక్కుతున్న గ్యాస్ ధరలు.. సామాన్య ప్రజల గగ్గోలు

"కందిపప్పు కొద్ది రోజుల క్రితం వరకూ 130-140 మధ్యలో ఉండేది. ప్రస్తుతం 180 పైనే ఉంది. అన్ని సరుకుల ధరలు పెరిగినాయి. మేము చిన్న టిఫిన్ బండి నడుపుతున్నాం. అస్సలు ఏం మిగలడం లేదు. రోజు గడవడం కష్టంగా ఉంది". - స్థానికురాలు

"సామాన్యుడి ఆదాయం పెరగలేదు. కానీ వస్తువుల ధరలు పెరగడం వలన అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా సమయంలో కష్ట కాలంలో ఉన్నామనుకుంటే.. అంతకు మంచిన కష్టంలో ప్రస్తుతం ఉన్నాం". - స్థానికుడు

Price Rise of Essential Commodities: భగ్గుమంటున్న నిత్యావసర ధరలు.. బెంబేలెత్తిపోతున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.