ETV Bharat / state

CHILD DEATH: శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన - guntur latest news

చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ... గుంటూరు జీజీహెచ్ ఎదుట శిశువు బంధువులు ఆందోళన చేశారు. చిన్నారి మృతి చెందినట్లు రెండుసార్లు మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట చనిపోకుండానే చనిపోయినట్లు నిర్ధారించి ఇంటికి పంపించారని, అలా చేసి ఉండకపోతే శిశువు బతికి ఉండే వాడని కన్నీటిపర్యంతమయ్యారు.

గుంటూరు జీజీహెచ్
గుంటూరు జీజీహెచ్
author img

By

Published : Jul 7, 2021, 11:01 PM IST

గుంటూరు అంకమనగర్​కు చెందిన ఝాన్సీరాణి... జూన్ 26న మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి అనారోగ్యంగా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ క్రమంలో బుధవారం 3.30 గంటలకు శిశువు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించి, మరణ ధ్రువీకణ పత్రాన్ని ఇచ్చారు.

మరోసారి చనిపోయినట్లు...

ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి శిశువులో కదలికలు గమనించిన తల్లిదండ్రులు... స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యులను సంప్రదించారు. చిన్నారి బతికే ఉన్నట్లు ఆర్ఎంపీ వైద్యులు చెప్పడంతో హుటాహుటిన జీజీహెచ్​కు తరలించారు. అక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... మార్గమధ్యంలో చనిపోయినట్లు మరోసారి సర్టిఫికెట్ ఇచ్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారి బంధువులు... మొదట చనిపోకుండానే చనిపోయినట్లు నిర్ధారించి ఇంటికి పంపించారంటూ ఆందోళనకు దిగారు. ఇంటికి తీసుకెళ్లి ఉండకపోతే శిశువు బతికే వాడని ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్ ఆదేశాలతో తదుపరి చర్యలు...

ఈ ఘటనపై ఆర్ఎంవో సతీష్ కుమార్ స్పందిస్తూ... బాలుడికి అన్ని పరీక్షలు చేసిన తర్వాతే చనిపోయినట్లు నిర్ధారించామన్నారు. ఎందువల్ల మృతిచెందాడో సర్టిఫికేట్​లో రాసి ఇచ్చామన్నారు. శిశువును రెండోసారి తీసుకొచ్చాక కూడా పరీక్షించి చనిపోయినట్లు చెప్పామని తెలిపారు. దీనిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మార్వో... బాధితులతో మాట్లాడి ఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

Accident: లారీ, కారు ఢీ... నవ దంపతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.