ETV Bharat / state

అందితే జుట్టు.. అందకుంటే చేతులు - lokal body elections newsupdates

గుంటూరు జిల్లాలో రెండోవిడత ఎన్నికలు జరుగుతున్న నరసరావుపేట డివిజన్‌లో నామినేషన్ల తొలిరోజే రాజకీయ మంత్రాంగం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామపత్రాలు తీసుకెళుతున్న అభ్యర్థులకు బుజ్జగింపులు, బెదిరింపులు మొదలయ్యాయి. పదవుల పంపకంలో సరికొత్త అంకానికి తెరలేపారు.

political ministry started on the first day of nominations in Narasaraopet division
అందితే జుట్టు.. అందకుంటే చేతులు
author img

By

Published : Feb 3, 2021, 2:05 PM IST

గుంటూరు జిల్లాలో రెండోవిడత ఎన్నికలు జరుగుతున్న నరసరావుపేట డివిజన్‌లో నామినేషన్ల తొలిరోజే రాజకీయ మంత్రాంగం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామపత్రాలు తీసుకెళుతున్న అభ్యర్థులకు బుజ్జగింపులు, బెదిరింపులు మొదలయ్యాయి. పదవుల పంపకంలో సరికొత్త అంకానికి తెరలేపారు. అధికార పార్టీకి మూడేళ్ల పాలనాకాలం ఉన్నందున ఏకగ్రీవాలకు సహకరిస్తే మూడేళ్ల తర్వాత సర్పంచి పదవి ఇస్తామని చెబుతున్నారు. మూడేళ్ల తర్వాత ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాని పక్షంలో మిగిలిన రెండేళ్లు కూడా ప్రస్తుతం సర్పంచి పదవి దక్కించుకున్నవారే కొనసాగేలా ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. రాజీకి వచ్చి సర్దుబాటు చేసుకుంటే సమస్యలు ఉండవని.. లేనిపక్షంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల అభ్యర్థులు గెలుపొందినా తాము సర్పంచి చెక్‌ పవర్‌ రద్దు చేయిస్తామని ప్రచారం చేస్తున్నారు. చెక్‌ పవర్‌ లేకపోతే అధికారంలో ఉన్నా లేనట్టేనని, ఎన్నికల్లో పెట్టిన డబ్బులు సైతం రావని సంకేతాలు పంపుతున్నారు.

ఏకగ్రీవాలకు సహకరిస్తే ఉపాధి హామీ బిల్లులు ఇప్పిస్తామని ఒత్తిడి తెస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు నియోజకవర్గ స్థాయి నేతల నుంచి పోటీ చేయాలని ఒత్తిడి ఉన్నట్లయితే బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికల్లో పరోక్షంగా సహకరించాలని లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల పోలీసులు ప్రత్యర్థి పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థుల కుటుంబసభ్యులు, స్నేహితులపై కేసులు నమోదు చేస్తామని బెదిరించి నామినేషన్‌ వేయకుండా చూస్తున్నారు. ఇందులో భాగంగానే నరసరావుపేట మండలం ఇక్కుర్రులో నామినేషన్‌ వేయడానికి సిద్ధమైన అభ్యర్థిని భర్తపై రాత్రికి రాత్రే కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లా సరిహద్దులోని ఒక మండలంలో వార్డు సభ్యులు, సర్పంచి స్థానాలకు ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పోటీకి దిగుతున్న వారి ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి పింఛను, రేషన్‌కార్డులు పోతాయంటూ బెదిరిస్తున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రత్యక్షంగా దాడులకు దిగకుండా తెరవెనుక పోటీదారులను దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

పట్టు నిలబెట్టుకునే దిశగా ప్రతిపక్షాలు

నరసరావుపేట డివిజన్‌లో అధికారపార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా అన్నిచోట్ల పోటీ చేసేలా నియోజకవర్గ నేతలు గ్రామస్థాయి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు భయపడి వెనక్కితగ్గితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయనే భావన గ్రామస్థాయి నేతల్లోనూ వ్యక్తమవుతోంది. దౌర్జన్యాలకు దిగితే ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలగడంతో పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉన్నచోట గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే సొంతపార్టీలో గ్రామాల్లో సీనియర్లను కాదని జూనియర్లను ప్రోత్సహించారు. పంచాయతీ ఎన్నికల్లో సీనియర్లంతా క్రియాశీలకంగా ఉండకుండా జూనియర్లు బాధ్యత తీసుకుంటారులే అని మిన్నకుండిపోవడంతో ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా సదరు నేతలో మార్పు కనిపించకపోవడంతో ప్రతిపక్ష పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థుల విజయానికి కృషిచేసి తామేంటో చూపించాలని సీనియర్లు పట్టుదలతో ఉన్నారు. అన్ని గ్రామాల్లోనూ పోటీకి ప్రతిపక్ష పార్టీలు సిద్ధం కావడంతో గ్రామస్థాయి నేతలు ముందుకువచ్చి పోటీలో నిలుస్తున్నారు. దీంతో రెండోవిడతలో ఎన్నికలు జరిగే నరసరావుపేట డివిజన్‌ పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక

నరసరావుపేట డివిజన్‌లో నామినేషన్ల పర్వం మంగళవారం ప్రారంభమైంది. చాలాగ్రామాల్లో ప్రధాన పార్టీల మద్దతుతో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాకపోవడంతో నామినేషన్లు ఊపందుకోలేదు. మంగళవారం సైతం చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామంలో ఇరుపార్టీల నాయకులు ఏకగ్రీవం కోసం ముందుకువచ్చినా ఎవరు ముందు, ఎవరు వెనుక అధికారాన్ని పంచుకోవాలన్నా విషయమై మీమాంస కొనసాగుతోంది. కొన్ని గ్రామాల్లో పార్టీలకతీతంగా ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామనేతలు చర్చలు జరుపుతున్నారు. అధికార పార్టీలో సర్పంచి పదవికి పోటీ చేసే అవకాశం రాని ఆశావహులు రెబల్స్‌గా బరిలోకి దిగితే తమకు సహకరించాలని ప్రతిపక్షపార్టీల సానుభూతిపరులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గ నేతల ఇళ్ల వద్ద ఆశావహులు బారులు తీరుతున్నారు. అధికారపార్టీ నేతలు ఏకగ్రీవాల దిశగా గ్రామస్థులపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీలకతీతంగా ఏకగ్రీవమైనా అధికారంలో ఉన్నందున తమ పార్టీ కండువా వేసుకోవాలనే షరతు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు రావాలంటే ఈసారికి మాట వినాల్సిందేనని నేత ఒకరు హెచ్చరికలు పంపుతున్నారు. మొత్తం మీద పల్నాడులో పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి:

ఈ - వాచ్‌ యాప్‌.. ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.