విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహ ధ్వంసం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ 'భాజపా- జనసేన' సంయుక్తంగా నేడు 'చలో రామతీర్థం' కార్యక్రమం నిర్వహించనున్నాయి. ముందస్తు చర్యగా భాజపా ముఖ్య నేత కన్నా లక్ష్మీనారాయణకు పోలీసులు గృహ నిర్బంధం నోటీసులు జారీ చేశారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వచ్చిన పోలీసులు.. ఆయన కుమారుడు నాగరాజుకు నోటీసులు అందజేశారు.
ఈ నెల 5వ తేదీన చేపట్టిన 'రామతీర్థ ధర్మయాత్ర' కార్యక్రమానికి కూడా పోలీసులు కన్నాను వెళ్లనీయలేదు. గురువారం మాత్రం రామతీర్థం తప్పక వెళ్తానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు రావొద్దని పోలీసులు కన్నాకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి బయటికి వస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి