ఇవీ చదవండి..
ఫొటో మార్ఫింగ్.. స్వతంత్ర అభ్యర్థి నిర్వాకం - ఫొటో మార్ఫింగ్
గుంటూరు జిల్లా మాచర్ల నుంచి పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థి.. ఎన్నికల్లో విజయం కోసం అడ్డదారులు తొక్కారు. అడ్డంగా దొరికిపోయారు.
ఫొటో మార్ఫింగ్.. స్వతంత్ర అభ్యర్థి నిర్వాకం
గుంటూరు జిల్లా మాచర్ల నుంచి పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థి.. ఎన్నికల్లో విజయం కోసం అడ్డదారులు తొక్కారు. అడ్డంగా దొరికిపోయారు. ఈ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా అంజిరెడ్డి పోటీ చేస్తున్నారు. అదే పేరు ఉన్న మరో వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీలో ఉన్నారు. తెదేపా అంజిరెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసిన ఇండిపెండెంట్ అంజిరెడ్డి.. ప్రజల్లో తిరిగారు. ఓట్లు అడిగారు. ఈ నిర్వాకాన్ని.. అధికార పార్టీ నేతలు గుర్తించారు. అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. గెలుపు కోసం నిజాయితీగా ప్రయత్నించాలి తప్ప.. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని హితవు పలికారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి..