ETV Bharat / state

Pending Bills in AP: బిల్లుల కోసం హెలిప్యాడ్‌ గుత్తేదారుల ఎదురుచూపులు.. రూ.5 కోట్లకు పైగా బకాయిలు..

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 8:13 AM IST

Updated : Sep 4, 2023, 11:18 AM IST

Pending Bills in AP: రాష్ట్రంలో ఏ ప్రాంతంలో సీఎం పర్యటన ఉన్నా అక్కడ హెలిప్యాడ్‌లు నిర్మించాల్సిందే. సీఎం హాజరయ్యే కార్యక్రమం తాడేపల్లిలోని ఆయన నివాసానికి కూతవేటు దూరంలో ఉన్నా హెలిప్యాడ్‌ నిర్మాణం తప్పనిసరి. ఐతే ఆగమేఘాల మీద హెలిప్యాడ్‌ల నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారులకు మాత్రం ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. ఫలితంగా బిల్లుల కోసం గుత్తేదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

Pending_Bills_in_AP
Pending_Bills_in_AP

Pending_Bills_in_AP: Pending_Bills_in_AP

Pending Bills in AP: గత ఏడాది జులై 4న భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు125వ జయంత్యుత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్‌ హాజరయ్యారు. ప్రధాని కోసం 3 హెలిప్యాడ్‌లు, సీఎం కోసం ఒక హెలిప్యాడ్‌ నిర్మించారు. వీటికి అయిన వ్యయం దాదాపు కోటి 30 లక్షల రూపాయలు. ఈ పనులు చేసిన నలుగురు గుత్తేదారులు బిల్లుల కోసం ఇప్పటికీ ఆర్‌ అండ్‌ బీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో ఏ కార్యక్రమమైనా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచే సీఎం జగన్‌ వర్చువల్‌గా పాల్గొనేవారు.

కొద్ది నెలలుగా ప్రతి రెండు, మూడు రోజులకు ఏ చిన్న కార్యక్రమమైనా ఏదో ఒక జిల్లాకు సీఎం వెళ్తున్నారు. దీంతో పెద్దఎత్తున హెలిప్యాడ్‌లు నిర్మిస్తున్న గుత్తేదారులకు.. బిల్లులివ్వకుండా వైసీపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో రహదారులు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది రోడ్లపై గుంతలు పూడ్చిన గుత్తేదారులకు కూడా ఇంకా పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. ఇదే గుత్తేదారులు సీఎం పర్యటనల సమయంలో హెలిప్యాడ్‌ల నిర్మాణం, బారికేడింగ్‌ ఏర్పాటు తదితర పనులు చేస్తున్నారు.

AP Contractors bills Problems: రాష్ట్రంలో బిల్లుల గోస.. వారికి మాత్రమే చెల్లింపులు..

వీరికి పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. సాక్షాత్తు సీఎం పర్యటనకు చేసిన పనులు కావడంతో, వెంటనే బిల్లులు ఇస్తారని ఎదురుచూస్తున్న గుత్తేదారులకు నిరాశ తప్పడంలేదు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 కోట్లకుపైగా ఇటువంటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సీఎం జగన్‌ పర్యటనల్లో చాలా చోట్ల పొలాల్లో హెలిప్యాడ్‌లు నిర్మించేలా ఆదేశిస్తున్నారు. ఇలా సాగుభూముల్లో వీటిని నిర్మించడంతోపాటు, అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్లే రహదారికి అనుసంధానం చేసేలా తాత్కాలిక రహదారి నిర్మాణం, ఆ రోడ్డుకు ఇరువైపులా బారికేడింగ్‌ తదితరాలన్నీ కలిపి 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు వ్యయమవుతోంది.

అమ్మో! ప్రభుత్వ కాంట్రాక్టా.. రాష్ట్రంలో చితికిపోయిన చిన్న కాంట్రాక్టర్లు..!

ఇలాంటి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. సీఎం పర్యటనల సమయంలో హెలిప్యాడ్‌ల నిర్మాణం, బారికేడింగ్‌ తదితరాలకు కలిపి 2022-23 బడ్జెట్‌లో 25 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ 8 కోట్ల 86 లక్షల రూపాయలు మాత్రమే విడుదలచేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పనులు చేసిన గుత్తేదారులకు మరో 5 కోట్ల 55 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటికి తొలుత కేవలం 3 కోట్ల 20 లక్షలు రూపాయల బడ్జెట్‌ మాత్రమే కేటాయించారు.

Contractors Bills: రాష్ట్రంలో బిల్లుల గోస..! దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టర్లు..

తర్వాత మరో 2 కోట్ల 85 లక్షల రూపాయలను అదనంగా కేటాయించారు. ఇలా మొత్తంగా రూ.6 కోట్ల 5 లక్షలు కేటాయించినా, ఇప్పటి వరకు 2 కోట్ల 54 లక్షల రూపాయల మేర మాత్రమే విడుదల చేశారు. హెలిప్యాడ్‌ల పనులకు సంబంధించిన 17 బిల్లులు అప్‌లోడ్‌ చేయగా, వీటికి 3 కోట్ల 50 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు అప్‌లోడ్‌ చేయని బిల్లులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నాయి. సీఎం పర్యటన ఉన్నప్పుడు ఆగమేఘాలపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయిస్తారని, బిల్లుల చెల్లింపు విషయానికి వచ్చేసరికి ఎవరూ పట్టించుకోవడంలేదని గుత్తేదారులు వాపోతున్నారు.

No Development Works: పన్నులపై ఉన్న శ్రద్ధ.. పనులపై ఉండదా! గుత్తేదారులు బెదిరిపోవడానికి ఎవరు కారణం?

Last Updated : Sep 4, 2023, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.