తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన భావజాలంతో విజయం సాధించిన వారికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. జనసేన పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ, నమ్మకం సంతోషం కలిగిస్తోందన్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటం, ధన బలం లేకున్నా.. జనసైనికుల పోరాటపటిమ ఆకట్టుకుందని తెలిపారు. రాబోయే విజయాలకు ఈ ఫలితాలు సంకేతాలుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
'ఎక్కువ మంది యువత ఉరకలెత్తే ఉత్సాహంతో నామినేషన్లు వేశారు.... అప్పుడే మన ధ్యేయం సగం నెరవేరిందని అభిప్రాయపడ్డా. ఎన్నికల్లో అధికార పార్టీ ధనబలం, ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అందరూ చూస్తున్నారు... వాటిని ఎదుర్కొని నిలబడినందుకు అభినందనలు. జనసేన విజయాలను తక్కువ చేసి చూపే వారి గురించి ఆలోచించవద్దు. ఇదే స్ఫూర్తిని మలి దశ ఎన్నికల్లోనూ కొనసాగించాలి'- పవన్ కల్యాణ్
ఎన్నికలలో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు తన తరఫున, జనసేన తరఫున హృదయపూర్వక అభినందనలను పవన్ కల్యాణ్ తెలియజేశారు.
ఇదీ చదవండి: