పవన్‌నాయుడు అంటూ తనను ఉద్దేశించి వైకాపా నేతలు మాట్లాడటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సీఎంను ఎలా పిలవాలో వైకాపా ఎమ్మెల్యేలంతా కూర్చుని ఓ తీర్మానం చేస్తే అలాగే పిలుస్తానన్నారు. తన పేరులో లేనిదాన్ని తనకు ఆపాదించవద్దని వైకాపా నాయకులకు సూచించారు. ఏ కులంలో, ఏ మతంలో పుట్టాలనే అవకాశం మన చేతుల్లో లేదని... ఎలా ప్రవర్తించాలో మన చేతుల్లోనే ఉంటుందని జనసేనాని అన్నారు.
ఇదీ చదవండి: