ETV Bharat / state

పోలవరం పూర్తై ఉంటే ముంపు సమస్య ఉండేది కాదు: పవన్

గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేవని... అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోలేదన్నారు. వరదల కారణంగా 10 వేల ఎకరాల్లో వరిపంట, 14 వేలకుపైగా ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయని... నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

pawan kalyan about godavari floods
పవన్ కల్యాణ్
author img

By

Published : Aug 21, 2020, 2:24 PM IST

Updated : Aug 21, 2020, 4:13 PM IST

గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జనసేన బృందాలు క్షేత్రస్థాయిలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి వాస్తవ పరిస్థితిని తనకు తెలియజేశాయన్నారు. ముంపు ప్రాంతాల ప్రజల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు 200 గ్రామాలు, లంకలు నీట మునిగి వేల మంది నిరాశ్రయులవ్వడం బాధాకరమన్నారు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేవని... అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేరన్నారు. పసిపిల్లలు పాలు లేక ఇబ్బందులు పడుతున్నారని... పాల కోసం అధికారులను అడిగితే.. అత్యవసర వస్తువుల జాబితాలోకి పాలు రావని నిర్లక్ష్యంగా సమాధానమివ్వటం దురదృష్టకరమన్నారు. ఈ కష్ట సమయంలో అత్యవసర వస్తువుల జాబితాలో పాలను చేర్చి పసిపిల్లల ఆకలి తీర్చాలని కోరారు.

వరదల కారణంగా 10 వేల ఎకరాల్లో వరిపంట, 14 వేలకుపైగా ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయని... నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, భవిష్యత్తులో ముంపు లేకుండా చూడాలని సూచించారు.

ఇవీ చదవండి..

సీఎం జగన్ మాట తప్పారు: దేవినేని ఉమ

Last Updated : Aug 21, 2020, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.