ETV Bharat / state

'ఏ చట్టాలైనా వైకాపా నేతలకు చుట్టాలే'

ముఖ్యమంత్రి జగన్​కు పంచుమర్తి అనురాధ బహిరంగ లేఖ రాశారు. దిశ చట్టం రాష్ట్రంలో అమలవుతుందనే నమ్మకం ఎవరకీ లేదనీ అనురాధ ఆరోపించారు.

author img

By

Published : Dec 15, 2019, 9:48 AM IST

panchumarti anuradha comments on disha act
'మాకు నమ్మకం లేదు'
'మాకు నమ్మకం లేదు'
దిశ చట్టం రాష్ట్రంలో సక్రమంగా అమలవుతుందనే నమ్మకాన్ని అందరికి కలిగించాల్సిన అవసరం ఉందని... తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అన్నారు. ఏ చట్టాలు తెస్తున్నా... అవి వైకాపా నాయకులకు చుట్టాలుగా మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు సీఎం జగన్​కు బహిరంగ లేఖ రాశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒక మహిళా అధికారి ఇంటికి మద్యం సేవించి అర్ధరాత్రి వెళ్లి బెదిరించినా... అతనిపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. దిశ బిల్లుని శాసనసభలో ఆమోదించిన రోజే గుంటూరులో ఐదేళ్ల బాలికపై లక్ష్మణ్‌ రెడ్డి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని, కొత్త చట్టం ప్రకారం నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేసి... బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అనురాధ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష... రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.