ETV Bharat / bharat

ఆ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఖర్చు రూ.585 కోట్లు! - LOK SABHA ELECTIONS CONGRESS

Lok Sabha elections Congress : ఇటీవలి లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఖర్చు వివరాలివే

source ANI
congress (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2024, 10:46 PM IST

Updated : Oct 8, 2024, 6:24 AM IST

Lok Sabha elections Congress Spent 585 Crores : రీసెంట్​గా జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల(ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ దాదాపు రూ.585 కోట్లు ఖర్చు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన వివరాలను కాంగ్రెస్​ ఎన్నికల సంఘానికి సమర్పించింది. ప్రకటనలు, మీడియా ప్రచారానికి రూ.410 కోట్లు, సోషల్ మీడియా యాప్‌లు ఇతర మార్గాల్లో వర్చువల్ ప్రచారాలకు దాదాపు రూ.46 కోట్ల ఖర్చు చేసినట్లు వెల్లడించింది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేళ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర స్టార్‌ క్యాంపెయినర్ల విమాన ప్రయాణాలకు దాదాపు రూ.105 కోట్లు ఖర్చయినట్లు హస్తం పార్టీ తెలిపింది. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ కోసం రాహుల్ గాంధీ సహా పలువురు కీలక లోక్‌సభ అభ్యర్థులకు రూ.11.20 కోట్లు ఖర్చుచేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, ఇతర ప్రచార సామగ్రి ముద్రణకు రూ.68.62 కోట్లు ఖర్చు చేసింది.

లోక్​సభ ఎన్నికలు ప్రకటించిన సమయంలో కాంగ్రెస్ వద్ద వివిధ డిపాజిట్ల రూపంలో మొత్తం రూ.170 కోట్లు ఉన్నాయి. అందులో రూ.13.76 కోట్ల నగదు డిపాజిట్‌ సహా వివిధ రూపాల్లో రూ.539.37 కోట్లు వచ్చాయి. మరోవైపు పన్ను రిటర్న్‌ల వివాదాల కారణంగా లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు చెందిన పలు బ్యాంకు ఖాతాలను ఇన్​కం ట్యాక్స్​ డిపార్ట్​మెంట్ ఫ్రీజ్‌ చేసింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కేంద్రంపై పార్టీ వర్గాలు మండిపడ్డాయి. దీనిపై దిల్లీలోని ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో అప్పీల్‌ చేయడం వల్ల కాంగ్రెస్​కు ఉపశమనం లభించింది.

Last Updated : Oct 8, 2024, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.