Goa By Weekly Express Train: ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలంటే ప్రయాణికులు అనేక కష్టాలు పడేవారు. కానీ ఇకపై నేరుగా గోవా వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎప్పటి నుంచో ఈ రైలు తీసుకురావాలన్న డిమాండ్ ఉండగా ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈనెల 9వ తేదీ నుంచి రెగ్యులర్ సేవలు అందించనుంది. గోవా వెళ్లే ప్రయాణికులు ఇకపై నేరుగా సికింద్రాబాద్ - వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లో హ్యాపీగా ప్రయాణించవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది.
అద్బుతమైన పర్యాటక ప్రదేశం గోవా. ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తుంటారని, అందులో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలవారే సందర్శిస్తుంటారని రైల్వేశాఖ అంచనా వేస్తుంది. నేరుగా గోవాకు వెళ్లే రైలు సదుపాయం లేక చాలామంది సొంత వాహనాల్లో గోవాకు వెళ్లి వస్తుంటారు. మరికొందరు ప్రైవేట్ బస్సులు, ఇతరత్ర వాహనాల్లో గోవాకు వెళ్తుంటారు. మొత్తానికి పర్యాటకులు వివిధ ప్రత్యామ్నాయ మార్గాల్లో గోవాకు చేరుకుంటున్నారు.
ప్రస్తుతం గోవాకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచిగూడ - యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 కోచ్‌లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి - ప్రయాణం సాగించేవారు. ఇలా గోవా వెళ్లే ప్రయాణికులు రైళ్లు మారుతూ అష్టకష్టాలు పడేవారు. తాజాగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రావడంతో గోవా పర్యాటకుల కష్టాలకు చెక్ పడిందని చెప్పవచ్చు.
రైలు వివరాలు, సమయాలు: గోవాకు బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈనెల 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.
- సికింద్రాబాద్ - వాస్కోడిగామా రెగ్యులర్ సర్వీస్ రైలు నెం. 17039 ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ప్రతి, బుధ, శుక్రవారాలలో రాకపోకలు సాగిస్తుంది.
- రైలు నం. 17040 వాస్కోడిగామా - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రైలు ప్రతి గురువారం, శనివారాలలో రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్ నుంచి 10:05 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6:20 గంటలకు చేరుకుంటుంది. ఉదయం 9 గంటలకు గోవాలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5:45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
- ఈ రైలులో మొదటి ఏసీ కోచ్ 1, సెకండ్ ఏసి కోచ్‌లు 2, థర్డ్ ఏసీ కోచ్‌లు 5, స్లీపర్ కోచ్‌లు 7, జనరల్, సెకండ్-క్లాస్ కోచ్‌లు 4 ఉన్నాయి.
ఏయే స్టేషన్లలో ఆగనుందంటే: సికింద్రాబాద్, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బల్లారి, హాస్పెట్, కొప్పల్, గడగ్, హబ్బలి, దర్వాత్, లొండ, కాస్టిల్ రాక్, కులేన్, సన్వోర్థన్, మడ్గామ్ ద్వారా వాస్కోడిగామా చేరుకుంటుంది.
ఆ రూట్లలో వెళ్లేవారికి 'హ్యాపీ జర్నీ' - 644 'దసరా స్పెషల్' ట్రైన్స్ - railway stations rush