ETV Bharat / state

అక్కడ ఎంపీటీసీ స్థానాలకు వైకాపా మాత్రమే నామినేషన్

గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా నేతల బెదిరింపులతో చాలాచోట్ల విపక్షాలు నామినేషన్లు వేయకుండా వెనక్కు తగ్గాయి. జిల్లాలో ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైన ఎంపీటీసీ స్థానాలు 77 ఉన్నాయి. అన్నీచోట్ల కూడా కేవలం వైకాపాకు చెందిన అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారు.

ycp
ycp
author img

By

Published : Mar 12, 2020, 2:43 PM IST

వైకాపా శ్రేణుల చర్యలతో గుంటూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు ప్రత్యర్థులు వెనక్కుతగ్గారు. అధికార పార్టీకి చెందిన నేతలు పలుచోట్ల ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. కొన్నిచోట్ల ప్రతిపక్ష పార్టీల తరఫున నామినేషన్లు వేసే వ్యక్తులను మంగళవారం రాత్రే బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసుల చేత బెదిరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

జిల్లా వ్యాప్తంగా 77 ఎంపీటీసీ స్థానాలకు వైకాపా మాత్రమే నామపత్రాలు సమర్పించటంతో అవి దాదాపు ఏకగ్రీవమైనట్లే. ఇందులో పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 60 స్థానాల్లో వైకాపా నామినేషన్‌ వేయగా మిగిలిన 11 స్థానాల్లో మాత్రమే ప్రతిపక్షాలు నామినేషన్‌ వేశాయి. ఏకగ్రీవాల్లో అధికశాతం పల్నాడు ప్రాంతంలోనే ఉన్నాయి. అది కూడా మాచర్ల నియోజకవర్గంలోనే 60 ఎంపీటీసి స్థానాలకు ఒక్కటే నామినేషన్ వచ్చింది. మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... కేవలం 11 చోట్ల మాత్రమే వేరే పార్టీల వారు నామినేషన్లు వేశారు.

వైకాపా మాత్రమే నామినేషన్‌ వేసిన స్థానాలివే....

మండలంవైకాపా మాత్రమే నామినేషన్‌ వేసిన స్థానాలు
వెల్దుర్తి

14

రెంటచింతల13
మాచర్ల12
దుర్గి12
కారంపూడి9
నర్సరావుపేట6
మాచవరం3
బెల్లంకొండ2
ముప్పాళ్ల1
మేడికొండూరు1
తాడికొండ

1

రొంపిచర్ల1
నాదెండ్ల1
వట్టిచెరుకూరు1

ఇదీ చదవండి:సీఐపై చేయిచేసుకున్న వైకాపా అభ్యర్థిని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.