ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - వినుకొండలో ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో.. ఓ వ్యక్తి మృతిచెందగా ఇద్దరు గాయపడ్డారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని చీకటిగల పాలెం అడ్డరోడ్డు రైల్వే బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది.

rtc bus hit two wheeler in vinukonda
వినుకొండలో ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
author img

By

Published : Apr 25, 2021, 8:20 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని చీకటిగలపాలెం క్రాస్​రోడ్డు రైల్వే బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కొప్పుకొండకు చెందిన మర్రి వెంకట రామయ్య (46), మర్రి పేరయ్య (54)తో పాటు చిన్నారి మౌనిక గాయపడ్డారు.

ఇదీ చదవండి: 100కుపైగా పోస్టులు తొలగించిన ట్విట్టర్, ఫేస్​బుక్

స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై వినుకొండ వెళ్తుండగా.. వినుకొండ నుంచి శ్రీశైలం వెళ్తున్న నరసరావుపేట డిపో ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆస్పత్రికి తరలిస్తుండగా.. తీవ్ర రక్తస్రావంతో మార్గంమధ్యలో పేరయ్య మృతి చెందాడు. ఈ ఘటనలపై పోలీసు వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ముగ్గురు సభ్యుల క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.