ETV Bharat / state

ఇద్దరు బిడ్డలు మృతి... మనస్తాపంతో తల్లి ఆత్మహత్య ! - గూంటూరు జిల్లా మాచర్లలో వృద్ధురాలు మిస్సింగ్

వ్యాపారంలో కాస్తో కూస్తో కూడబెట్టుకొని సాఫీగా సాగిపోతున్న కుటుంబం అది. అలాంటి కుటుంబంలో కరోనా మహమ్మారి అలజడి సృష్టించింది. నెలల వ్యవధిలో ఇద్దరు కుమారులు మృతి చెందడం వల్ల మనస్తాపం చెందిన తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన మాచర్ల పోలీసులు... ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

old woman missing case registered in macherla police station
ఇద్దరు కొడుకుల మృతి... మనస్తాపంతో సాగర్ కాలువలో దూకిన తల్లి ?
author img

By

Published : Oct 26, 2020, 9:13 PM IST

గుంటూరు జిల్లా మాచర్లలో వ్యాపార చేసుకునే ఆ కుటుంబాన్ని విషాదం వెంటాడుతుంది. కుటుంబంలో పెద్ద కుమారుడు మూడు నెలల క్రితం చనిపోయాడు. మృతుడు తమ్ముడుకి నెల రోజుల క్రితం కొవిడ్ సోకడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఇటీవల అతని ఆరోగ్యం కాస్త కుదుట పడటం వల్ల పర్వాలేదని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ అతనూ అకస్మాత్తుగా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కుమారులు బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న ఆ తల్లి.. నెలల వ్యవధిలో తన ఇద్దరు కుమారులు చనిపోవడం వల్ల తల్లడిల్లిపోయింది. మానసిక సంఘర్షణకు గురైంది. కొడుకు చనిపోయిన దృశ్యాన్ని చూసి తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోయింది.

జమ్మల మడక వైపు ఉన్న సాగర్ కుడి కాలువ వైపు వెళ్లి అందులో దూకి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. వృద్ధురాలు కనిపించడం లేదని కుటుంబీకుల నుంచి ఫిర్యాదు అందినట్లు మాచర్ల అర్బన్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. సాగర్ కుడి కాలువ వద్ద వృద్ధురాలి చెప్పులు ఉన్నట్లు కొందరు తమ దృష్టికి తెచ్చారన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె ఆచూకీ కోసం గలిస్తున్నటు సీఐ తెలిపారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 1,901 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.