గుంటూరు జిల్లా రేపల్లె సామాజిక వైద్య కేంద్రానికి వైద్యం కోసం వెళ్లిన ఓ వృద్దుడు మృతి చెందాడు. రేపల్లె మండలం పోటు మెరక గ్రామానికి చెందిన ఏడుకొండలు (60) అనారోగ్యంతో చికిత్స కోసం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాడు. ఓపీ రాయించుకునెందుకు క్యూలో నిలబడ్డాడు.
ఉన్నట్టుండి ఒక్కసారిగా నిలుచున్న చోటనే కుప్పకూలి పోయాడు. గమనించిన వైద్యులు వెంటనే పరీక్షించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబీకులకు సమాచారాన్ని తెలియజేశారు. అదే ఆసుపత్రిలో కొవిడ్‌తో ఓ మహిళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: