గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 50కి పైగా కరోనా కేసులు నమోదు కావడంపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఇప్పటివరకు మంగళగిరిలో 17, తాడేపల్లిలో 25 కేసులు వచ్చాయి. ఆ ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు సమీక్షించారు. వీలైనన్ని ఎక్కువ వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేయాలని కింద స్థాయి సిబ్బందికి అధికారులు సూచించారు. సినిమా హాళ్లు, విందులు, వినోదాలు జరిగే చోట ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. లేనిచో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. అపార్ట్మెంట్లో ఎవరికైన కరోనా నిర్ధరణ అయితే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించాలన్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాతే పరిస్థితిని బట్టి జోన్ ఎత్తివేయాలని చెప్పారు.
ఇదీ చదవండి: